రైతు బీమా బంద్ అంటే
రైతు కండ్లలో కన్నీళ్లు రాలుతున్నయ్
వచ్చిన తెలంగాణలో ఒక్కొక్క పథకం
ఎండుటాకై ఎగిరిపోతున్నాయి
నేల కొరిగిన రైతుకు మేలు చేసిన
రైతు బీమా రాలిపోతున్నది
ఆసరా అయిన పథకం ఆగిపోతున్నది
రైతుల మనసు రగిలిపోతున్నది
ఆగిపోతున్నయంటే దుఃఖం ఆగడం లేదు
గుంట భూమి ఉన్న కూలి రైతుకైనా
మేలు చేసిన రైతు బందు పథకం
మరణించిన రైతుకు కుటుంబానికి
మంచిగ ఆసరైన పథకం
తెచ్చుకున్న తెలంగాణలో
ఇప్పుడు అమలుకాని పథకం
ఆకురాలినట్టు రాలిపోతున్న పథకం
ఎండిన ఆకోలే ఎగిరిపోతున్నది
రైతు బీమా రాదంటే ఊపిరాగుతున్నది
-దేవరపాగ కృష్ణయ్య ,9963449579