మూన్‌లైటింగ్ వరమా? నేరమా?
18వ శతాబ్దం చివర్లో ఫ్రాంక్రైట్ అనే అమెరికన్ ఆర్కిటెక్ట్‌ను ‘మూన్‌లైటింగ్' కారణంగా ఉద్యోగం నుంచి తొలగించారు. మూన్‌లైటింగ్ వల్ల సాఫ్ట్వేర్ రంగం క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్నదని విప్రో అధినేత రిషద్ ప్రేమ్‌జీ వాపోయారు
18వ శతాబ్దం చివర్లో ఫ్రాంక్రైట్ అనే అమెరికన్ ఆర్కిటెక్ట్‌ను ‘మూన్‌లైటింగ్’ కారణంగా ఉద్యోగం నుంచి తొలగించారు. మూన్‌లైటింగ్ వల్ల సాఫ్ట్వేర్ రంగం క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్నదని విప్రో అధినేత రిషద్ ప్రేమ్‌జీ వాపోయారు. ఉద్యోగులు తమ ఆర్థిక అవసరాలకోసం ఫూర్తిస్థాయి ఉద్యోగంతో పాటు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చని స్విగ్గీ ప్రకటించడమే తాజా చర్చకు కారణం.
యజమానికి తెలియకుండా ఒక ఉద్యో గి అదనంగా మరో ఉద్యోగం చేయడాన్ని ‘మూన్‌లైటింగ్’ అంటారు. కానీ ఉద్యోగులు ఇటీవల ఈ నిబంధనను పక్కన పెట్టి పని చేసుకుంటున్నారు. వ్యక్తిగత ఆర్థికాంశాలపై హార్వర్డ్ బిజినెస్ మేగజైన్ ప్రచురించిన వ్యాసంలో ఈ పొకడను ‘వ్యక్తిగత ఆర్థిక భద్రత కల్పించుకోవడం’గా అభివర్ణించారు. కరోనా కాలంలో ఇంటినుంచి పని చేయాల్సి రావడం, సాంకేతిక నైపుణ్యానికి డిమాం డ్ పెరగడంతో ‘మూన్ లైటింగ్’కు దారులు పడ్డా యి. ముఖ్యంగా ఐటీ రంగంలో ఈ పద్ధతి సాధారణమైంది. కొన్ని కంపెనీలు తగిన జీతాలు, అదనపు పనిగంటలకు వేతనం ఇవ్వటంలేదు. అయితే ‘మూన్ లైటింగ్’ను అమలు చేయాలా, వద్దా అనేది కంపెనీల అభిప్రాయానికి వదిలే యాలని ‘టీమ్‌లీజ్ సర్వీసెస్’ సంస్థ అభిప్రాయ పడింది.
చట్టపరంగా ఓ వ్యక్తి రెండు సంస్థల్లో పని చేయకూడదన్న నిబంధన ఎక్కడా లేదని కార్మిక, ఉపాధి చట్టాల నిపుణుడు నిశిత్దేశాయ్ అంటున్నారు. కానీ చట్టంలో లేకపోయినా కంపెనీలు అలాంటి కార్యకలాపాలపై నిబంధనలు విధించవచ్చని ఆయ న తెలిపారు. సాధారణంగా కంపెనీలు తమ ఉద్యోగులు ఇతర సంస్థల్లో పనిచేయకూడదని భావిస్తా యి. తమ రహస్యాలు, కీలక సమాచారం బయట కు పొక్క కూడదనే ఉద్దేశంతో కంపెనీలు ఇలాంటి నిబంధనలు విధిస్తాయి. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిని ఉద్యోగం నుంచి తొలగించడానికి కంపెనీలు వెనుకాడవు. కాబట్టి మూన్‌లైటింగ్ విషయంలో ఉద్యోగులు నిజాయితీగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో స్విగ్గీ విధానం ప్రకారం.. కంపె నీ ఉత్పాదకత దెబ్బ తినకుండా ఆఫీస్ టైమ్ అయిపోయిన తర్వాత, వారాంతాల్లో ఉద్యోగులు తమ కు నచ్చిన పనులు చేసుకోవచ్చు. అయితే ఈ పనులకు సంబంధించిన కొన్ని వివరాలను మాత్రం ఉద్యోగులు కంపెనీకి అందించాల్సి ఉంటుందని తెలిపింది.
రెండు లేదా అంతకంటే ఎక్కువ కంపెనీల్లో పని చేయడం ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. ఉద్యోగులు చేసే పని మీద, వారి వ్యక్తిగత జీవన సమతుల్యత మీద, పనిలో చూపించే శ్రద్ద పట్ల, పని సమయాలమీద అది ప్రభావం చూపిస్తుంది. ఈ విషయాలన్నీ ఒక ఉద్యోగి మూన్‌లైటింగ్ చేయగలడా లేదా అన్న విషయాన్ని నిర్దేశిస్తాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, యజమానులు ‘మూన్ లైటింగ్’ ఏ రకమైన ఉద్యోగాల్లో సాధ్యమవుతుందో పరిశీలించాలి. ‘మూన్‌లైటింగ్’ గురించి ఒక విధానం అవసరమా, కాదా అనే విషయాన్ని పక్కన పెట్టి, ఈ విధాన ఫలితాల గురించి అర్థవంతమైన చర్చ జరగడం అవసరం.
– పల్లవి నహతా
బీక్యూ ప్రైమ్ సౌజన్యంతో
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

