మోదీ చట్టంపై అంబానీ, అదానీ ‘యుద్ధం’!
ప్రపంచ కుబేరులైన ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల యాజమాన్యంలోని సంస్థలు సహా 21 వార్తా సంస్థల బృందం భారతదేశ గోప్యతా చట్టాన్ని న్యాయస్థానంలో సవాలు చేసింది.
- గోప్యతా చట్టంపై సుప్రీంకోర్టులో మీడియా సంస్థల రహస్య’ పిటిషన్
- కీలక నిబంధనలను రద్దు చేయాలని 21 కంపెనీల బృందం వాదన
న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరులైన ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల యాజమాన్యంలోని సంస్థలు సహా 21 వార్తా సంస్థల బృందం భారతదేశ గోప్యతా చట్టాన్ని న్యాయస్థానంలో సవాలు చేసింది. ఈ చట్టం పరిశోధనాత్మక జర్నలిజాన్ని అణచివేస్తుందని, జర్నలిస్టులకు సమాచారాన్ని అందచేసే వర్గాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించేలా చేస్తుందని ఈ సంస్థలు వాదించినట్టు తెలుస్తున్నది. వినియోగదారుల డిజిటల్ వ్యక్తిగత డాటాను పరిరక్షించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం గత సంవత్సరం ఒక గోప్యతా చట్టాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించింది.
మీడియా సంస్థలకు మినహాయింపు లేని కారణంగా ఈ చట్టాన్ని పత్రికా స్వేచ్ఛపై దాడిగా ప్రచురణకర్తలు అభివర్ణించారు. ఈ చట్టం పత్రికా స్వేచ్ఛను రక్షిస్తుందని ప్రభుత్వంతో ఆగస్టులో జరిగిన సమావేశంలో మీడియా సంస్థలకు హామీ లభించినప్పటికీ యూరోపియన్ యూనియన్, సింగపూర్, బ్రిటన్‌లో ఉన్నట్టుగా జర్నలిస్టులకు ఇందులో లిఖితపూర్వక మినహాయింపు లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నదని భారతదేశపు డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఒక రహస్య పత్రంలో పేర్కొంది.
ఈ పత్రాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ పరిశీలించింది. అక్టోబర్ 6న దాఖలైన ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరగనున్నది. అంబానీ, అదానీల నేతృత్వంలోని వ్యాపార సంస్థలు ప్రధాని మోదీకి సన్నిహితంగా ఉన్నాయని, వారికి అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తుండగా ఈ ఆరోపణలను ఆ వ్యాపార సంస్థలు ఖండిస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి ఒక అసాధారణమైన సవాలుగా కూడా ఈ వ్యాజ్యం నిలుస్తున్నది.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

