మనిషి చెట్టు
ఔను.. ఇప్పుడు మనిషి చెట్టు కావాలి మంచి మనసు పరిమళాలు పూయాలి
ఔను.. ఇప్పుడు మనిషి
చెట్టు కావాలి
మంచి మనసు
పరిమళాలు పూయాలి
సమాజ హితమొసగే
మానవత్వ ఫలాలు కాయాలి
కాలుష్యం కల్మషం
పెచ్చుమీరిన వాతావరణంలో
దగాకోరు విషవాయు విహారం నిలువరించి
స్వచ్ఛమైన సహాయకారి
ప్రాణవాయువు ప్రసరించాలి
పరోపకారమే పరమధర్మమని నినదించాలి
ప్రయోజనం లేని ఎడారి గుండెలు కావు
పచ్చటి కారుణ్య హరితం అభివ్యాపించాలి
స్వార్థం ముళ్ళచెట్లు కావు
నిస్తేజపు నిష్క్రియాపర్వపు
కలుపు మొక్కల ఆలవాలం కాదు
దేశహితార్థపు మనిషి
చెట్ల ఆనవాళ్లు మనకు
ఇప్పుడు అవసరం
వంచన లోయల మోసకారులు కాదు
హిమోన్నత శిఖర వ్యక్తిత్వ నాగరికులు
ప్రాదుర్భవించాలి
మనిషి చెట్ల కొరత తీరే
హరితహారం కావాలి
విస్తృతి దృశించాలి
సమాజహిత నినాద సవ్వడి
చేసే మనిషి చెట్లు ఇప్పుడు
మరింత అవశ్యం…
-డాక్టర్ చిట్యాల రవీందర్
77988 91795
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

