ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ అడిగే నేతలు తాను ఫలానా ఎన్నికల్లో పోటీ చేశానని, ఫలానా ఎన్నికల్లో గెలిచానని తనకున్న అర్హతలుగా చూపుతారు. కానీ, సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా టికెట్ ఆశిస్తున్నవారు విచ్రితంగా గతంలో ఎమ్మెల్యేగా ఓడిపోవడాన్నే ఒక అదనపు అర్హతగా చూపుతున్నారట. ఎమ్మెల్యేగా ఓడిపోయినోడివి, ఎంపీగా ఎలా గెలుస్తావని వారిని ప్రశ్నిస్తే బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయి.. ఎంపీగా గెలచి కేంద్రమంత్రి కాలేదా? సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఓడిపోయి, ఎంపీగా గెలువలేదా? కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బండి సంజయ్ ఎమ్మెల్యేగా ఓడిపోయి, ఎంపీగా గెలిచినవారే కదా? అంటూ లాజిక్కులు చెప్తున్నట్టు వినికిడి.
శామీర్‌పేట సమీపంలోని ఔటర్‌రింగ్ రోడ్డుకు పక్కనున్న రిసార్ట్స్‌లో ఝార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఝార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష జరిగే వరకు పది రోజుల దాకా ఎమ్మెల్యేలు చేజారకుండా హైదరాబాద్‌లో ఇంతకంటే సురక్షితమైన ప్రాంతం మరొకటి ఉండదన్నది కాంగ్రెస్ ఆలోచన. అయితే క్యాంప్ ఉన్న రిసార్ట్స్‌కు సమీపంలోనే బీజేపీ ముఖ్య నాయకుడు ఈటల రాజేందర్ ఇల్లు ఉంది.. జాగ్రత్త అని క్యాంప్ ఇంచార్జీగా ఉన్న ఏఐసీసీ సెక్రెటరీ సంపత్‌కుమార్‌ను పార్టీ సీనియర్ నేత ఒకరు హెచ్చరించినట్టు సమాచారం.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఢిల్లీకి ఎప్పుడు వెళ్లినా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని తప్పకుండా కలుస్తారు. రాష్ట్రంలో కోమటిరెడ్డిది కూడా అదే శాఖ. తన శాఖకు చెందిన మంత్రి కాబట్టి కేంద్ర మంత్రిని కలిస్తే తప్పేంటి? అని ప్రశ్నించడం సహజం. కానీ, కోమటిరెడ్డి మంత్రి కాకముందు కూడా నితిన్ గడ్కరీని రెగ్యులర్‌గా కలిసేవారు. మరి ఇప్పుడు అంటే ఓకే.. అప్పుడు ఎందుకు కలిసినట్టు? కోమటిరెడ్డి బ్రదర్స్ కాంట్రాక్టర్లు కాబట్టి ఏదైనా జాతీయ రహదారికి సంబంధించిన బిల్లు పెండింగ్‌లో ఉందేమో? ఈ మాట ఎక్కడో కాదు, సెక్రటేరియట్ క్యాంటీన్లో ఇద్దరు కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన సంభాషణలో దొర్లింది.
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు హైదరాబాద్ చుట్టుపక్కల ఎంపీ సీటు అడగకుండా, తనకు ఏ మాత్రం సంబంధం లేని ఖమ్మం టికెట్‌కు దరఖాస్తు ఎందుకు చేసుకున్నట్టు? అన్నది ఇప్పుడు ఆ పార్టీలో జరుగుతున్న చర్చ. ఇదే విషయాన్ని వీహెచ్‌ను ఒక మిత్రుడు అడిగితే.. ‘ఇదిగో చూడురా భయ్, ఖమ్మం టికెట్ అడుగుతున్నదెవరు? డిప్యూటీ సీఎం తన భార్యకు అడుగుతుండ్రు. మంత్రి పొంగులేటి తన సోదరుడికి అడుగుతుండ్రు. మంత్రి తుమ్మల తన కుమారుడికి అడుగుతుండ్రు? పార్టీ హైకమాండ్ ఒకవేళ ఈ టికెట్ మంత్రుల కుటుంబ సభ్యులు ఎవరికీ ఇవ్వవద్దని అనుకుంటే, అప్పుడు ఆ అవకాశం నాకే వస్తుంది కదా? సమజ్ అయిందా?’ అని ఎదురు ప్రశ్నించారట.
-వెల్జాల