పరడ శాసనంలో తెలుగు పద్యం

నల్లగొండ జిల్లాలోని ‘పరడ’ ప్రాచీన నగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామానికి బయట ఉన్న కొండకు తూర్పుభాగంలో శిథిల ఆంజనేయ, శివాలయాలు ఉన్నాయి. ఆంజనేయస్వామి ఆలయం దగ్గర నల్లసరపు రాతిపై ఒక శాసనం ఉంది. ఈ శాసనాన్ని కీ.శే. బి.ఎన్.శాస్త్రిగారు మొదటిసారి వెలుగులోకి తెచ్చారు. ఈ శాసనం కందూరి చోడ వంశానికి చెందిన ఉదయనచోడ మహారాజు కాలంలో వేయించినది.
కందూరిచోడులు కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా, మహామండలేశ్వరులుగా ఉన్న విషయం విదితమే. ఈ శాసనంలో చాళుక్య చక్రవర్తి అయిన జగదేకమల్ల దేవుని ప్రశంస ఉంది. ఇతడు శ్రీమత్ప్రతాప చక్రవర్తిగా కీర్తించబడినాడు. ఈ శాసనము రక్తాక్షి సంవత్సర పుష్య బహుళ ఆదివారం నాడు జగదేక చక్రవర్తి 7వ రాజ్య సంవత్సరంలో వేయించబడింది. దానిని శా.శ 1065= క్రీ.శ 1143గా శాస్త్రి నిర్ణయించారు.
ఉదయనచోడ మహారాజు ప్రభుత్వమును అష్టస్వామ్య భోగముగా అనుభవించడానికి కౌండిన్య గోత్రజుడైన కరణం బ్రహ్మదేవని కాళ్ళు కడిగి ధారా పూర్వకముగా దానమిచ్చిన విషయము ఈ శాసనంలో ఉంది.
శాసనము 3,4 ప్రక్కలందు కందూరు ఉదయనచోడ మహారాజు కరణము అయిన బ్రహ్మదేవండు దానమిచ్చిన విషయం ఉన్నది. ఇందు లో కందూరు 1100లోని ఆమనకంటి 70లో ఉన్న పరడ గ్రామానికి తూర్పున నివసిస్తున్న పురోహితుల వారికి గల భూమిలో మూడవ వంతు తమ తండ్రి మల్లపరాజు పేరు మీద కట్టించిన మల్ల సముద్రం చెరువు కింద ఒక మర్తురు భూమి, వెలిపొలము; నెమ్మాని ప్రభుత్వంలో గల నాలుగో వంతు భూమి సూర్య గ్రహణ సమయంలో తన తండ్రికి ధర్మార్థముగా సర్వకర పరిహారముగా దానమిచ్చాడు.
కందూరి ఉదయన చోడ మహారాజు వేయించిన శాసనము చివర తెలుగు పద్యముంది.
‘నమ్మాశేషమరున్నికాయుండు జగన్నాథుండు రక్షింపగా /సాంమ్రాంజ్యంబుదయ క్షితీశ్వరునకా చంద్రార్క తారంబుగాన్/ (స)సమ్మానంబడసెం బ్రభుత్వము హిమానీహార చంద్ర ప్రభా / కమ్రశ్లోకుండు బ్రహ్మదేవ నిభుండాకల్పాన్తర స్థాయిగాను..’
శాసనములో ఉదయనచోడ మహారాజు ‘సమధిగత, పంచమహా శబ్ద, మ హా మండలేశ్వర, వీర మహేశ్వర, కోడూర్పురవరేశ్వర, కాశ్యప గోత్ర, కరి కాలాన్వయ నామాది సమస్త ప్రశస్తి సహితు’డని వర్ణించబడినాడు. శాసనాంతమున వ్యాస గీతా శ్లోకములున్నవి. దాన ఫలములు వివరించబడినవి.
- డాక్టర్ భిన్నూరి మనోహరి
9347971177
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- Inscription
- literature
- telugu
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్‌లో చెలరేగిన హింస.. 1000 మంది అరెస్ట్.. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్ల ప్రయోగం
AP News | రానున్న ఐదు రోజులు అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు ఏపీ హోంమంత్రి ఆదేశం..!
CULT Title | సూర్య సినిమా కోసం ‘కల్ట్’ టైటిల్ అడిగారు.. కానీ నేను ఇవ్వలేదు: విశ్వక్ సేన్
Rahul Gandhi | ‘మా ర్యాలీకి పబ్లిసిటీ చేస్తున్నందుకు థ్యాంక్స్’.. బీజేపీపై రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు..!
Weekly Bus Pass | హైదరాబాద్ ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఇక ‘వీక్లీ బస్ పాస్’తో అపరిమిత బస్ ప్రయాణం
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

