ఎములాడ రాజన్న
పడగ ఎత్తిన నాగు మెడకు సొబగాయే నడుమున ఏనుగు తోలు వలువాయే షష్టి చందుర వంక సిగన నగతీరాయే నెత్తినెత్తిన గంగ నీకెంతొ ప్రియమాయే
పడగ ఎత్తిన నాగు మెడకు సొబగాయే
నడుమున ఏనుగు తోలు వలువాయే
షష్టి చందుర వంక సిగన నగతీరాయే
నెత్తినెత్తిన గంగ నీకెంతొ ప్రియమాయే
మస్తు మస్తుగున్నవు మా రాజరాజేశ్వర
వస్తిమి ఎములాడ భక్తితో శ్రీ రాజరాజేశ్వర
ధర్మగుండంలో నిండ మునకలేస్తాము
బిరబిర నీకడకు తరలి వస్తాము
కొబ్బరికాయలు కొట్టి నిన్ను మొక్కేమూ
పత్రి పూలు పెట్టి నీ పూజ చేసేము
మస్తు మస్తుగున్నవు మా రాజరాజేశ్వర
వస్తిమి ఎములాడ భక్తితో శ్రీ రాజరాజేశ్వర
రోజంతా శివరాత్రి ఉపాసముంటాము
రేయంతా నిదురోక జాగారముంటాము
ఊరంతా గుడికాడ వండుకొని తింటాము
భక్తులందరికి అన్నదానాలు చేస్తాము
మస్తు మస్తుగున్నవు మా రాజరాజేశ్వర
వస్తిమి ఎములాడ భక్తితో శ్రీ రాజరాజేశ్వర
పార్వతమ్మతో జరుగు నీ పెండ్లి చూసేము
అరదమెక్కించి మిమ్ము ఊరంతా తిప్పేము
శివరాత్రి జాతరల సిత్తమంతా నువ్వేలే
మూడు రోజుల పాటు ఆనందాలూ నవ్వులే
మస్తు మస్తుగున్నవు మా రాజరాజేశ్వర
వస్తిమి ఎములాడ భక్తితో శ్రీ రాజరాజేశ్వర
– డాక్టర్ గొల్లపెల్లి రాంకిషన్ (రాఖీ)
98496 93324
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- Hindu Deity
- lord shiva
- poem
- telugu
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

