వాంఛిత విచ్ఛిన్నత!
గాలిలో ఏదీ ఎక్కువ కాలం ఎగుర లేదు నేల మీద కాలు మోపాల్సిందే! తొక్కడం అలవాటు పడిన వాళ్లకు తొక్కించుకోవడం వింత అనుభవం!
గాలిలో
ఏదీ ఎక్కువ కాలం
ఎగుర లేదు
నేల మీద కాలు మోపాల్సిందే!
తొక్కడం అలవాటు పడిన వాళ్లకు
తొక్కించుకోవడం వింత అనుభవం!
ఒడ్డు చేరకముందే
తెరచాప ఒకింత
చిరుగుతున్న దృశ్యం
హోరు గాలిలో రాష్ట్ర రాజకీయం!
నిర్ణీత కాలాన్ని
ఎవరు రాసుకొస్తారు
అధికారమూ అంతే
జనన మరణాల వంటిదే!
నిత్యం చెలరేగుతూ
దూసుకుపోతున్న బాణాన్ని
వెనక్కి పిలువడమే
జీర్ణించుకోలేని ఓటమి!
కండ్లు ఎవరూ
నెత్తికెక్కించుకోరాదనే వాళ్లయినా
అర్థం చేసుకోవాలి
అవి నెత్తికెక్కితే దారి కనబడదు!
పొదగకముందే
గుడ్డొకటి పగులుతున్న చప్పుడు
ఆశావహులంతా చాప కింది నీళ్లే!
జనం కన్న కలలు
ఒక్కొక్కటి వివర్ణమవుతుంటే
ఈ అకాల విచ్ఛిన్నత
బహుశా జనాకాంక్షనే!!
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 9440233261
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

