ఆకాశభగీరథుడు
నింగిచెట్టుకు యుద్ధవీరుడు బిగించి ఒదిలిన గురితప్పని బాణం! సరిహద్దుల్లో శత్రుసైన్యాన్ని మట్టుబెట్టేందుకు నొక్కిన తుపాకి ట్రిగ్గర్!
నింగిచెట్టుకు
యుద్ధవీరుడు బిగించి ఒదిలిన
గురితప్పని బాణం!
సరిహద్దుల్లో శత్రుసైన్యాన్ని
మట్టుబెట్టేందుకు
నొక్కిన తుపాకి ట్రిగ్గర్!
నడుముకు తనంత బరువైన
కత్తుల మోకును
మెడలో పాములా చుట్టుకొని
ఒడుపునకే ఒడుపు నేర్పి
మిద్దె మెట్లెక్కినంత సునాయాసంగా…
కైలాసగిరి నధిరోహించే త్రినేత్రుడా!
ప్రతిపూట ఆకాశం నిచ్చెనెక్కి
మధ్యలో మెట్టు తాడు మీద
కత్తులకు సానపెట్టుకుని
ప్రాణం అరచేతుల్లో పట్టుకొని
తాటి ఎవరెస్ట్నెక్కే టెన్సింగ్నార్గే!
చంటిపాపల చంపల్ని
మమకారంగా నిమిరినట్లు
గగనవిల్లుకు వేలాడే
ఒక్కో మబ్బుల గెలకు
సుతారంగా మునివేళ్ళ ఉలితో
నైపుణ్యంగా లొట్టినమర్చే జక్కన!
అనునిత్యం ఆకాశగంగను
భూమ్మీదకు తెచ్చి
శ్రమజీవుల దాహం తీర్చే అపరభగీరథుడా!
ఆదిమానవులకైనా…అత్యాధునికులకైనా…
అమ్మవారికి సైతం అత్యంత ప్రియమైన
నరులపాలిటి సురాపానీయాన్ని
సృష్టిలోంచి పునఃసృష్టించే సృజనశీలి!
తాటి శిఖరాలకు వేళ్ళాడే నైపుణ్యంతో
శ్రమకు నిలువెత్తు రూపానివై
ఒంటినిండా ధైర్యంతో ఖగోళ జలంతో
భూగోళాన్ని చల్లబరిచే భూమిపుత్రుడా!
ఆమ్మ కడుపులో నేనున్నప్పుడు
వేవిళ్ల బాధకు తాళలేక
అమ్మ తాగిన పొద్దటి కల్లుతో
పెరిగిన నా దేహం
చనుబాలతో కలిసిన
చెట్టు పాల తీపి అక్షరాల్లోకి అనువాదమై
నన్ను కవిత్వ రసహృదయున్ని చేసిన
అమృతబిందువుల ప్రధాత!
-ప్రొ.బాణాల శ్రీనివాసరావు ,9440471423
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

