Trsv | రైతన్నకు అండగా కదిలిన టీఆర్ఎస్వీ

ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణ రాష్ట్ర రైతులకు అండగా నిలబడేందుకు టీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి విభాగం టీఆర్ఎస్వీ ముందుకు దూకింది. ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్రం అవలంబిస్తున్న అస్పష్ట వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఛలో ఇందిరాపార్క్ కార్యక్రమానికి సంఘీభావంగా టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణ నుంచి విద్యార్థులు బైక్ ర్యాలీగా ఇందిరాపార్క్‌కు తరలివెళ్లారు. ఈ సందర్భంగా తుంగ బాలు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను సీఎం కేసీఆర్ ఎండగడుతున్నారని చెప్పారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న నేడు తమ ధాన్యం కొనాలంటూ అన్నమో రామచంద్ర అని తమ గోడు వెల్లబోసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రం అస్పష్ట వైఖరితో పాటు రాష్ట్ర బీజేపీ నాయకుల పొంతన లేని ప్రకటనలతో రైతులు తీవ్ర గందరగోళ పరిస్థితిలో కూరుకుపోయారని వాపోయారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ధర్నాలో ముఖ్యమంత్రి, మంత్రులు సహా ప్రజాప్రతినిధులంతా పాల్గొనడం అభినందనీయమన్నారు.
తెలంగాణ రైతుల పట్ల కేంద్రానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. రైతుల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో రైతుల పొట్టగొట్టేటటువంటి నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి వారి నడ్డివిరిచే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నల్లగొండజిల్లా పర్యటనకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు తెలంగాణ రైతుల సెగ ఎలా తగిలిందో, వారి పార్టీకి సైతం రానున్న రోజుల్లో అదే గతి పడుతుందని హెచ్చరించారు. ధాన్యాన్ని కొనేలా కేంద్రప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఒత్తిడి తీసుకువస్తుంటే, మరోవైపు ఆయనను విమర్శిస్తున్న వారి చర్యలను రాష్ట్ర రైతాంగం గమనిస్తోందన్నారు.
పంజాబ్‌లో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కేంద్రం కొనుగోలు చేస్తున్నప్పుడు, తెలంగాణ రైతులు పండించిన పంటను ఎందుకు కొనుగోలు చేయరని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే బీజేపీ నాయకులను రాష్ట్రంలో ఎక్కడా తిరుగనీయబోమని హితవు పలికారు.
వారిని అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు శిగ వెంకట్, భాస్కర్, కృష్ణ, నవీన్, మధు, వెంకట్, శ్రీకాంత్, నరేశ్, ప్రశాంత్, జంగయ్య, కార్తీక్, క్రాంతి, రాల్, నాగరాజు, శివ, అవినాశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nayanthara | ‘మూక్కుత్తి అమ్మన్-2’ నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా.. నయనతార ఎమోషనల్ పోస్ట్ వైరల్
Mahatma Gandhi Grandson: అమెరికాలో 30 ఎకరాల భూమిపై వివాదం.. కేసు నెగ్గిన మహాత్మా గాంధీ మనవడి ట్రస్టు
Health tips | అరటిపండుతో అన్నీ లాభాలే.. అవేంటో తెలుసా..?
Smartphone Sales | పండుగ సీజన్లో తగ్గిన ఫోన్లు, టీవీల అమ్మకాలు.. దుకాణాల్లో పేరుకుపోయిన స్టాక్.. కంపెనీల కీలక నిర్ణయం !!
Rowdy Janardhana | రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన’.. తొలిసారి విజయ్‌తో కీర్తి సురేష్ జోడీ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

