ఉస్మానియా యూనివర్సిటీ : నిరుద్యోగులు తమ ఎంప్లాయ్మెంట్ కార్డుల పునరుద్ధరణకు అవకాశం కల్పించినట్లు యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో (యూఈఐజీబీ) డిప్యూటీ చీఫ్ టి. రాము తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 45 ఏళ్లలోపు వయసు ఉన్న నిరుద్యోగుల ఎంప్లాయ్మెంట్ కార్డులు ల్యాప్స్ అయితే వాటిని ఈ డిసెంబర్ 31వ తేదీలోగా పునరుద్ధరించు కోవచ్చని చెప్పారు.
దాంతో తమ పాత సీనియారిటీని తిరిగి పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోదలిచిన వారు http://www.employment.telangana.gov.in ఆధార్ కార్డు నెంబర్ ద్వారా లాగిన్ అయి, పాత ఎంప్లాయ్మెంట్ కార్డును రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు.