Hyderabad | ప్రజల భద్రత కోసం సీసీటీవీ తప్పనిసరి : ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

మన్సూరాబాద్ : ప్రజల భద్రత కోసం కాలనీ సంక్షేమ సంఘాలు విధిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి సరస్వతినగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను సోమవారం ఆయన కాలనీ సంక్షేమ సంఘం ప్రతనిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణతో పాటు ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ కెమెరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. సీసీటీవీ కెమెరాలు ఉన్న కాలనీలలో నేరాలు గణనీయంగా తగ్గిపోయాయని తెలిపారు.
సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరం ఉందని.. కాలనీలలో వీటిని ఏర్పాటు చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, సీఐ అశోక్‌రెడ్డి, కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, మన్సూరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, మాజీ అధ్యక్షుడు పోచబోయిన జగదీష్‌యాదవ్, నాయకులు జక్కిడి రఘువీర్‌రెడ్డి, నరి వెంకన్న కురుమ, రుద్ర యాదగిరి, టి. మోహన్‌రెడ్డి, నరి అంజయ్య, కంచర్ల రాకేష్‌రెడ్డి, విజయ భాస్కర్‌రెడ్డి, చెంగల్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

