Telangana bonalu | కలాసిగూడ జూలమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు

బేగంపేట్ :సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని కలాసిగూడ జూలమ్మ దేవాలయంలో ఆదివారం శ్రావణ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర, మాజీ కార్పొరేటర్ కోషికే కిరణ్మయికిషోర్లు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఉత్సవాలను పురస్కరించుకోని ఆలయ నిర్వహాకులు అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పూజల అనంతరం దేవాలయం ప్రాంగణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయం అధ్యక్షుడు ఓంప్రకాశ్, సభ్యులు ఆంజనేయులు, విజయ్‌చారి, బ్రాహ్మచారి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

