Tagore auditorium | మూడు దశాబ్దాల తరువాత ఓయూలో చిత్రాల ప్రదర్శన

ఉస్మానియా యూనివర్సిటీ : ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు తమ భవితవ్యాన్ని రూపుదిద్దు కునేందుకు సహకరించే సందేశాత్మక చిత్రాలను శనివారం నుంచి ప్రదర్శించనున్నారు. విద్యార్థులను తమ లక్ష్యం చేరుకునేలా ప్రేరేపించే సినిమాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
దాదాపు మూడు దశాబ్దాల క్రితం నిలిచిపోయిన ఈ సంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనికి ఠాగూర్ ఆడిటోరియం వేదికగా నిలువనుంది. గతంలో ఈ ఆడిటోరియాన్ని కేవలం స్నాతకోత్సవాల నిర్వహణకు మాత్రమే వినియోగించేవారు.
ఓయూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ పి. నవీన్‌కుమార్ పర్యవేక్షణలో ఆడిటోరియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వెయ్యి మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ ఆడిటోరియంలో సెంట్రలైజ్డ్ ఏసీ, సీసీ కెమెరాలు, ఎల్సీడీ ప్రొజెక్టర్, పెద్ద స్క్రీన్, నాణ్యమైన ఆడియో సిస్టం, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ ప్రాంతం తదితర అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి.
శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ‘ఇన్విక్టస్’ సినిమాను తొలిసారిగా ప్రదర్శించనున్నారు. విద్యార్థులు ఈ సినిమాను వీక్షించేందుకు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు అధికారులు గూగుల్ ఫామ్‌ను రూపొందించి, దానికి సంబంధించి లింక్‌ను విద్యార్థులందరికీ పంపించారు. ఇప్పటికే దాదాపు 750 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

