GHMC | వయోవృద్ధులకు ఇంటివద్దే కొవిడ్ టీకాలు

సైదాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ కొవిడ్ టీకాలు ఇవ్వాలని ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో సీనియర్ సీటిజన్లకు ఇంటి వద్దే కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని సింగరేణి ఆఫీసర్స్ కాలనీలో సీనియర్ సీటిజన్లకు ఆరోగ్య కార్యకర్త సరిత కొవిడ్ టీకాలు వేశారు.
ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ట్రస్ట్ సంస్థ ప్రతినిధులు ఓఎస్వీడీ ప్రసాద్, నేరళ్ల ప్రసాదరావు, శేషగిరిరావు, వైఎస్ఆర్ మూర్తి, సర్వేశ్వరరావు మాట్లాడుతూ దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇంటింటికీ వెళ్లి వైద్య సిబ్బందితో కలిసి టీకాలు వేయిస్తున్నామని, కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రతి ఒక్కరూ తీసుకుని కొవిడ్‌కు దూరంగా ఉండలన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఆఫీసర్ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

