Brahmi Muhurtham | బ్రాహ్మీముహూర్తం అంటే ఏమిటి?
బ్రాహ్మీముహూర్తం అంటే ఏమిటి? మంత్ర సాధనకు ఆ సమయం ప్రశస్తమైనదని చెబుతారు ఎందుకు? l శ్రీధర్, సిద్దిపేట తెల్లవారుజామున 3 గంటల 20 నిమిషాల నుంచి 5 గంటల 40 నిమిషాల మధ్యకాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. మనిషికి జ్ఞానాన్ని అందించే అద్భుతకాలం బ్రాహ్మీముహూర్తం.
బ్రాహ్మీముహూర్తం అంటే ఏమిటి? మంత్ర సాధనకు ఆ సమయం ప్రశస్తమైనదని చెబుతారు ఎందుకు?
– శ్రీధర్, సిద్దిపేట
తెల్లవారుజామున 3 గంటల 20 నిమిషాల నుంచి 5 గంటల 40 నిమిషాల మధ్యకాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. మనిషికి జ్ఞానాన్ని అందించే అద్భుతకాలం బ్రాహ్మీముహూర్తం. సాధారణంగా ప్రతిగంటకు గ్రహహోర మారుతుంది. అంటే క్షితిజ రేఖ దగ్గర ఆ గ్రహం కనిపిస్తుందని అర్థం. హోరాకాలానికి అధిదేవత అయిన గ్రహం మనం చేసే పనులను నిర్దేశిస్తుందని జ్యోతిషం చెబుతున్నది. తెల్లవారుజామున బ్రాహ్మీముహూర్తంపై ఏ గ్రహాల ప్రభావమూ ఉండదు.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సైతం అతీతమైన సర్వ చైతన్యమయమైన అమ్మవారి శక్తిమాత్రమే ఈ కాలంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఆ శక్తికి రూపగుణాలు ఉండవు. అది శుద్ధ చైతన్యం. కేవలం జ్ఞాన స్వరూపం. అందుకే తెల్లవారుజామున నేర్చుకున్న విద్య హృదయానికి హత్తుకుంటుంది. బాగా జ్ఞాపకం ఉంటుంది. ఏకాగ్రత కుదురుతుంది. వాక్శుద్ధి కలుగుతుంది. అందుకే, చదువుకు, జపసాధనలకు బ్రాహ్మీముహూర్తాన్ని మించింది లేదని పెద్దలు చెబుతుంటారు.
– శ్రీ
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

