Ahalya | అహల్య గాథ

వికారమైన రూపాన్ని హలం అంటారు. హలం నుంచి పుట్టిందే హల్యం. అహల్య అంటే అత్యంత సౌందర్యవతి అని అర్థం.
ఇంద్రుడు ముల్లోకాలకు అధిపతే కావచ్చు. కానీ, పరస్త్రీని కామించడంతో శాపోపహతుడు అయ్యాడు. అలాగే అహల్య బ్రహ్మ కుమార్తె. అంతేకాదు తపోవిభవుడైన ఋషి భార్య. అయినా, మనో చంచలత్వం మూలంగా శిక్షను అనుభవించింది. ఆమె తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం చెందడం వల్ల దోషాన్ని పోగొట్టుకొని తిరిగి భర్తను పొందగలిగింది.
బ్రహ్మ తన తపస్సును వెచ్చించి అత్యంత సౌందర్యవతి అయిన స్త్రీ మూర్తిని సృష్టించాడట. ఆవిడే అహల్య. తన సౌందర్యాన్ని చూసి మోహించిన దేవతలు అహల్యను భార్యగా పొందాలని భావించారట. అయితే, ఎవరైతే ముందుగా భూ ప్రదక్షిణ చేసి వస్తారో వారికే అహల్యనిచ్చి వివాహం చేస్తానన్నాడు బ్రహ్మ. దేవతలంతా భూ ప్రదక్షిణకు బయల్దేరుతారు. నారదుని ప్రోత్సాహంతో గౌతమ మహర్షి తన తపశ్శక్తితో అప్పుడే ప్రసవిస్తున్న గోవును సృష్టించి, దాని చుట్టూ ప్రదక్షిణ చేశాడట. అలా భూప్రదక్షిణ చేసిన పుణ్యం పొందడంతో అహల్యను గౌతమునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు బ్రహ్మ.
వాల్మీకి రామాయణంలో గౌతముని రూపంలో వచ్చిన ఇంద్రుడిని అహల్య గుర్తిస్తుంది. ‘ఓ సురశ్రేష్ఠా! నా దాంపత్య జీవితంలో నేను సంతుష్టురాలనై ఉన్నాను. త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపో’ అంటూ మందలిస్తుంది అహల్య. ఇంద్రుడు కూడా ‘నీ పద్ధతికి ఆనందించాను. వెళ్లిపోతాన’ని బయటకు వస్తాడు. అదే సమయంలో గౌతముడు వచ్చి అహల్యను శపించడం కనిపిస్తుంది. అయినా లోకంలో ఇంద్రునికి అహల్యాజారుడని పేరు ఉన్నది. అది పైపైన చెప్పుకొనే అర్థమే. ఇందులోని ఆంతర్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి.
లోకం అంటే తాత్వికంగా మనస్సు అని అర్థం. చంచలమైన మనస్సు, ఇంద్రియ లౌల్యం కారణంగా భోగలాలసత వైపు ఆకర్షితమవుతుంది. మన మనస్సు ఎలా ఉంటుందో, మనకు లోకం కూడా అలా కనిపిస్తుంది. ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడు. కాబట్టి, మనస్సును సకారాత్మకంగా నడిపించగలిగితే ఆంతర్యాన్ని అవగాహన చేసుకోగలుగుతాం. ‘అహః లీయతే అస్యాం ఇతి అహల్య’ అంటారు. అహస్సు అంటే పగలు. అదిదేనిలో లీనమవుతుందో అది అహల్య. కాబట్టి, అహల్య అంటే రాత్రి అని అర్థం. ‘అహస్సు రాత్రిలో లీనమవడం’ జారత్వంగా చెబుతారు. అహల్య కథ నిజానికి ప్రతీకాత్మకమైన గాథగా చెప్పుకోవాలి. ‘గో’ శబ్దానికి కిరణాలు అని అర్థముంది. సాధారణంగా పగలు కనిపించే కిరణాలు రాత్రిలో లీనమవుతాయి. ఇంద్రుడు అంటే సూర్యుడిని చెబుతుంది శబ్దరత్నాకరం. సూర్యోదయం కాగానే రాత్రి ఉనికిని కోల్పోతుంది. దీనినిబట్టి సూర్యోదయంతో అంటే ఇంద్రుడు రావడంతో అహల్య (రాత్రి) సూర్యునిలో (ఇంద్రునిలో) లయమైందని భావం. ఈ ప్రకారంగా అహల్యాజారుడు అనే భావన ఏర్పడింది.
ఈ కథను పోలిన మరోగాథ ప్రచారంలో ఉంది. ఒకసారి నిమి అనే రాజు గౌతముని ఆశ్రమం సమీపంలో యజ్ఞాన్ని నిర్వహించాలనుకుంటాడు. యజ్ఞం నిర్వహించాలని వశిష్ఠుడిని ప్రార్థించాడు. ఆ సమయంలో వశిష్ఠుడు మరొక యజ్ఞ నిర్వహణలో ఉండటంతో కొన్నాళ్లు ఆగమంటాడు. కానీ, నిమి త్వరగా చేయాలనే ఆత్రుతతో గౌతముని ఆశ్రయిస్తాడు. వశిష్ఠుని స్థానంలో ఉండి యజ్ఞాన్ని నిర్వహిస్తాడు గౌతముడు. అప్పుడు
అక్కడికి వచ్చిన వశిష్ఠుడు తనను అవమానించిన నిమిని శపించడం, నిమి వశిష్ఠుడికి ప్రతిశాపం ఇవ్వడం జరిగిపోతాయి. ఈ ప్రక్రియలో వశిష్ఠుని స్థానంలో ఉన్న గౌతముడు యజ్ఞాన్ని నిర్వహించిన దోషం, గౌతముని స్థానంలో ఇంద్రుడు రావడంగా భావించాలి. ప్రతీకాత్మకంగా చెప్పిన అహల్య గాథ లోకంలో మరోవిధంగా ప్రచారం కావడం దురదృష్టం.
పాలకుర్తి రామమూర్తి
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

