రావమ్మా.. మహాలక్ష్మి!
దీపావళి సంతసం ధన త్రయోదశితో మొదలవుతుంది. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఈ పర్వం నిర్వహించుకుంటారు. ధన త్రయోదశి నాడు మహాలక్ష్మి వైకుంఠం నుంచి భూలోకానికి వస్తుందని, ప్రతి లోగిలిలో సంచరిస్తుందని పెద్దలు చెబుతారు. శుచి, శుభ్రత, సంప్రదాయం పాటించే ఇంట్లో కొలువుదీరుతుందట.
- బుధవారం ధనత్రయోదశి
దీపావళి సంతసం ధన త్రయోదశితో మొదలవుతుంది. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఈ పర్వం నిర్వహించుకుంటారు. ధన త్రయోదశి నాడు మహాలక్ష్మి వైకుంఠం నుంచి భూలోకానికి వస్తుందని, ప్రతి లోగిలిలో సంచరిస్తుందని పెద్దలు చెబుతారు. శుచి, శుభ్రత, సంప్రదాయం పాటించే ఇంట్లో కొలువుదీరుతుందట. అందుకే, అమ్మవారికి స్వాగతం పలుకుతూ ఉదయాన్నే ఇల్లూ, వాకిలీ శుభ్రం చేసుకొని, ముగ్గులు తీర్చిదిద్దాలి. ఇంట్లోవారంతా అభ్యంగన స్నానం చేసి, శుభ్రమైన వస్ర్తాలు ధరించి, పూజామందిరాన్ని మంగళకరంగా అలంకరించుకొని లక్ష్మీపూజ చేయాలి. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇక లక్ష్మీదేవి పూజలో భాగంగా ఇంట్లో వెండి వస్తువులు, బంగారు ఆభరణాలు ఆవుపాలతో శుభ్రం చేసి పూజామందిరంలో ఉంచాలి. లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ వాటిని పూజించాలి.
సంపదను సత్కార్యాలకు సద్వినియోగం చేయటమే లక్ష్మీదేవి ఆరాధనలో ఆంతర్యం. ఇందుకు తగిన సంకల్పంతో దీక్షను పొందడానికి ధనత్రయోదశి వేదికగా నిలుస్తుంది. ఆనాడు లక్ష్మీపూజ చేసినవారికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ‘చతుర్వర్గ చింతామణి’ గ్రంథం వివరిస్తున్నది. ఆనాటినుంచి దీపావళి వరకు మూడురోజులపాటు ‘గో త్రిరాత్ర వ్రతం’ నిర్వహించాలని, గోమాతను లక్ష్మీ స్వరూపంగా గుర్తించి గో సేవ చేయాలనీ ఆ గ్రంథం చెబుతున్నది. ధనత్రయోదశి నాడు పితృదేవతలు తమ వారసులను ఆశీర్వదించటానికి భూమికి దిగి వస్తారని, వారికి దారి చూపటానికి ఇంటిలో దక్షిణం వైపుగా దీపం పెట్టాలని కూడా పెద్దలు సూచించారు. దీనిని ఆచరించినవారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఆవు నెయ్యితో వెలిగించిన దీపాలతో ఇంటిని అలంకరించి, దీపదానం చేయటం కూడా సంప్రదాయంలో భాగం. లక్ష్మీపూజ, గోసేవ, దీపారాధన, దీపదానం, పితృదేవతారాధన ఇవన్నీ ధన త్రయోదశి ప్రత్యేకతలు.
…? కీర్తన
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palakurthi Congress Leaders | భారత పౌరసత్వమే లేని ఝాన్సీ రెడ్డికి పీసీసీ పదవి ఎలా ఇస్తారు?
Fire At Oil India Tank Farm | ఆయిల్ ఇండియా సంస్థ చమురు నిల్వల వద్ద అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
Peptides | అమెరికా ఆరోగ్య రంగంలో కీలకమార్పు.. పెప్టైడ్ల వినియోగానికి గ్రీన్ సిగ్నల్.. ఏంటివి.. ఎలా పనిచేస్తాయి..?
Illegal Arrest | బీఆర్ఎస్ నాయకుడు బాలరాజు యాదవ్ అక్రమ అరెస్ట్
OPPO Smart Phone | ఒప్పో నుంచి బ్యాటరీ బాంబ్.. ఏకంగా 12,000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

