Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Kalpavruksha Vahanam | తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
తిరుమల : తిరుమల ( Tirumala ) శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ( Brahmotsavams ) వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామి ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో కల్పవృక్ష వాహనం ( Kalpavruksha Vahanam ) పై భక్తులకు దర్శనమిచ్చారు.

మంగళవాయిద్యాలు, భక్తబృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ప్రబంధ పారాయ ణం నడుమ వాహనసేవ వైభవంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారి కృపాకటాక్షాలు పొందారు.

క్షీరసాగర మథనంలో ఉద్భవించిన కల్పవృక్షం కోరిన ఫలాలను ప్రసాదించే దివ్య వృక్షంగా పురాణాలు పేర్కొంటాయి. అటువంటి కల్పవృక్ష వాహనంపై స్వామివారు దర్శనమివ్వడం భక్తులకు ఐహిక శుభాలు, సకలాభీష్టాల ప్రాప్తికి ప్రతీకగా నిలుస్తుంది . గురువారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారని అర్చకులు తెలిపారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

