మహిళా పోలీస్‌పై మామ లైంగిక దాడి : బాసటగా నిలవాల్సిన భర్త బరితెగించాడు!

మీరట్ : రక్షక భటులుగా బాధితులకు అండగా నిలవాల్సిన వారే స్వంత మనిషినే కాటేశారు. కామంతో కండ్లు మూసుకుపోయిన మామ తాను పోలీస్ అనే విషయం మరిచి మహిళా పోలీస్‌గా పనిచేస్తున్న కోడలిపైనే లైంగిక దాడికి దిగాడు. జరిగిన ఘోరాన్ని కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తన భర్తకు చెప్పగా ఆమెకు అండగా ఉండాల్సిన ఖాకీ ట్రిపుల్ తలాఖ్ చెప్పి విడాకులిచ్చేసి తప్పు చేసిన తండ్రిని దండించకుండా తప్పించుకున్నాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.
మహిళ ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో నిందితుడు దారుణానికి ఒడిగట్టాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా ఆయన కోడలిని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న తండ్రీ కొడుకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత మహిళా కానిస్టేబుల్ భర్త మీరట్‌లోని పోలీస్ లైన్స్‌లో పనిచేస్తుండగా, మామ ప్రస్తుతం ఘజియాబాద్‌లో పనిచేస్తున్నాడు. నిందితులైన భర్త, మామలపై కొత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని మీరట్ ఎస్పీ వినీత్ భట్నాగర్ పేర్కొన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
మరణంలోనూ మహాదానం.. 8 మందికి ప్రాణం పోసిన టీచర్ నీరజారెడ్డి
Mission bhagiratha water | అధికారులూ 4 రోజులవుతుంది పట్టించుకోరా..? వృథాగా పోతున్న మిషన్‌భగీరథ నీరు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

