కుమారుడి మృతదేహాన్ని 22 రోజులుగా ఫ్రీజర్‌లో ఉంచిన తండ్రి.. ఎందుకంటే?

లక్నో: అనుమానాస్పదంగా మరణించిన కుమారుడి మృతదేహాన్ని తండ్రి 22 రోజులుగా తన ఇంట్లోని ఫ్రీజర్‌లో ఉంచారు. కుమారుడు హత్యకు గురైనట్లు ఆరోపించిన ఆయన న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు నిర్వహించబోనని అన్నారు. దిగి వచ్చిన అధికారులు మృతదేహానికి రీపోస్ట్‌మార్టం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 32 ఏండ్ల శివాంక్ పాఠక్ 2012 నుంచి ఢిల్లీలోని కాల్ సెంటర్లో పని చేస్తున్నారు. తనకు పరిచయమైన గుర్లీన్ కౌర్ అనే మహిళతో 2013లో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నివాసం ఉంటున్న శివాంక్ ఆగస్ట్ 1న అనుమానస్పదంగా మరణించారు. దీంతో మృతదేహానికి ఢిల్లీలో పోస్ట్‌మార్టం నిర్వహించి అతడి తండ్రికి అప్పగించారు.
అయితే, ఉత్తరప్రదేశ్ సుల్తాన్పూర్ జిల్లా మజావున్ గ్రామంలో నివాసం ఉంటున్న శివాంక్ తండ్రి, రిటైర్డ్ సుబేదార్, శివ ప్రతాప్ పాఠక్ తన కుమారుడి మరణంపై అనుమానం వ్యక్తం చేశారు. కుమారుడి పేరుపై ఉన్న ఆస్తులపై అతడి భార్య కన్నువేసిందని, ఈ నేపథ్యంలో అతడ్ని హత్య చేశారని ఆయన ఆరోపించారు. పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. దీంతో న్యాయం జరిగేంత వరకు కుమారుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించబోనని చెప్పారు. ఈ నేపథ్యంలో గత 22 రోజులుగా శివాంక్ మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచి తన ఇంట్లో భద్రపరిచారు.
మరోవైపు కుమారుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని, లేనిపక్షంలో శివప్రసాద్‌పై చర్యలు తీసుకుంటామని సుల్తాన్పూర్ జిల్లా అధికారులు హెచ్చరించారు. కాగా, యూపీలోని అధికార బీజేపీతోపాటు, ఎస్పీ, ఆప్ స్థానిక నేతలు శివ ప్రసాద్‌ను కలిసి తమ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు దిగి వచ్చారు. కుమారుడి మృతదేహానికి మంగళవారం రీపోస్ట్‌మార్టం నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన డాక్టర్ల ప్యానెల్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తుందని సుల్తాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ రవీష్ గుప్తా వెల్లడించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- 22 days
- 2nd autopsy
- conduct
- Father
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

