బాలుడి అనుమానాస్పద మృతి : ఇంటిపై నీటి ట్యాంకులో మృతదేహం
అనుమానాస్పద మృతి | రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి నిద్రించిన రెండేండ్ల బాలుడు తెల్లవారే సరికి ఇంటిపై నీటి ట్యాంకులో శవమై కనిపించాడు.

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి నిద్రించిన రెండేండ్ల బాలుడు తెల్లవారే సరికి ఇంటిపై నీటి ట్యాంకులో శవమై కనిపించాడు. రాత్రి తమ వద్దే నిద్రించిన బాలుడు తెల్లవారుజామున 2 గంటల నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడి ఆచూకీ కోసం వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సమీపంలోని సీసీకెమెరాలను పరిశీలించినా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఇంటిని అణువణువునా గాలించారు. చివరకు ఇంటిపైకప్పుపై ఉన్న నీటి ట్యాంకును పరిశీలించగా బాలుడి మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని బయటకు తీసిన పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదవశాత్తు జరిగిందా.? లేక హత్యా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

