Crime News | కోటలో మరో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య..
Crime News | రాజస్థాన్ లోని కోటలోని కోచింగ్ సెంటర్లో విద్యాభ్యాసం చేస్తున్న ఇద్దరు విద్యార్థులు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మొత్తం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23కి చేరింది.
Crime News | దేశంలోనే అత్యుత్తమ కోచింగ్ హబ్‌గా పేరొందిన రాజస్థాన్ లోని కోటలో తాజాగా మరో ఇద్దరు విద్యార్థులు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే జేఈఈ మెయిన్, వైద్య విద్యను అభ్యసించడానికి జరిపే నీట్, ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసెస్ అధికారులు కావాలని ఆకాంక్షించే వారి కోసం కోటలో పలు కోచింగ్ కేంద్రాలు ఉన్నాయి..
కానీ నీట్ ఎంట్రన్స్ కోచింగ్ తీసుకుంటున్న అవిష్కార్ శుభాంగి, బీహార్ విద్యార్థి ఆదర్శ్ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఈ ఏడాది రాజస్థాన్ కోటలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23కి చేరుకున్నది. 2018 తర్వాత ఇది అత్యధికం. పరిస్థితులు ఆందోళన కరంగా మారడంతో నెల రోజులుగా కోటలోని కోచింగ్ కేంద్రాల్లో ఎటువంటి పరీక్షలు నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ ఓపీ బంకర్ తెలిపారు.
మహారాష్ట్రకు చెందిన అవిష్కార్ శుభాంగి.. కోటలో ఉన్న తన బామ్మ తాతయ్యల వద్ద ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఆదివారం టెస్ట్ తర్వాత ఆరో అంతస్తు నుంచి దూకాడు. పోలీసులు చికిత్స కోసం అతడ్ని దవాఖానకు తీసుకెళ్లగా, అప్పటికే మరణించాడని చెప్పారు. ఆదివారం సాయంత్రం కున్నదిలో ఆదర్శ్.. ఉరేసుకుని మరణించాడని పోలీసులు తెలిపారు. కొవిడ్ తర్వాత విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం 60 శాతానికి పెరిగిందని, ఇది ఆందోళనకరం అని స్థానిక డీఎస్పీ ధరంవీర్ సింగ్ తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Crime news
- Kota
- Rajastan
- Suicide
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

