నిందితులను పట్టుకునేందుకు వెళ్తే కుక్కలను ఉసిగొల్పిన దుండగులు
క్రైం న్యూస్ | హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై పెంపుడు కుక్కలతో వదిలి భయబ్రాంతులకు గురి చేసిన ఘటన బంజారా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

హైదరాబాద్ : హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై పెంపుడు కుక్కలతో వదిలి భయబ్రాంతులకు గురి చేసిన ఘటన బంజారా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో నివాసం ఉంటున్న జాఫ్రీ అనే వ్యక్తితో మహ్మద్ ఆరిఫ్ అనే వ్యక్తికి గత కొంత కాలంగా స్థల వివాదం ఉంది.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం సుమారు 20 మంది గుండాలతో ఆయన ఇంటికి వెళ్లిన ఆరిఫ్ తదితరులు కర్రలు, రాడ్స్ తో దాడి చేశారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులపై హత్యా యత్నం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడిని పట్టుకునేందుకు ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసానికి వెళ్లారు.
పోలీసుల రాకను గమనించిన ఆరిఫ్ తో పాటు చెల్లెళ్లు కలిసి పోలీసుల మీదకు కుక్కలు వదిలారు. తమకు పెద్దవాళ్లు తెలుసు అని, పోలీసులు తమను ఏమీ చేయలేరంటూ దుర్భాషలాడారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు నిందితులపై మరో కేసు నమోదైంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

