ఆర్థిక ఇబ్బందులు తాళలేకే రియల్టర్ ఆత్మహత్య

హైదరాబాద్ : కౌకూర్ అటవీ ప్రాంతంలో చనిపోయిన రియల్టర్ నవీన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు నగరంలోని జవహర్‌నగర్ పోలీసులు గురువారం తెలిపారు. జవహర్‌నగర్‌కు చెందిన నవీన్ రెడ్డి (32) రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాల బారిన పడ్డాడు. దీంతో అప్పులు తీర్చే విషయంలో మానసిక వేదనకు గురై విషం తాగి జీవితాన్ని ముగించాడని పోలీసులు వెల్లడించారు. మృతుడి భార్య పింకి తెలిపిన ప్రకారం.. అప్పులు తీర్చే క్రమంలో మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది.
శవ పరీక్ష చేసిన గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యులు సైతం విషం సేవించడం కారణంగానే వ్యక్తి మృతిచెందినట్లు తెలిపారు. బుధవారం అటవీ ప్రాంతంలోని చెట్ల పొదల్లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని గురువారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

