నికితా తోమర్ హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

చండీగఢ్: హర్యానాలోని ఫరీదాబాద్‌లో గత ఏడాది సంచలనం రేపిన నికితా తోమర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు తౌసిఫ్, అతడి అనుచరుడు రెహాన్‌ను దోషులుగా బుధవారం నిర్ధారించిన ఫరీదాబాద్ జిల్లా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు శుక్రవారం శిక్షలు ఖరారు చేసింది. వారిద్దరికి జీవితకాల జైలు శిక్ష విధించింది. హత్యకు ఉపయోగించిన దేశీయ తయారీ తుపాకీని సరఫరా చేసిన ఆరోపణలపై అరెస్టయిన అజారుద్దీన్, అలియాస్ అజ్రును నిర్దోషిగా ప్రకటించింది.
గత ఏడాది అక్టోబర్ 26న కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తున్న 21 ఏండ్ల నికితా తోమర్‌ను కిడ్నాప్ చేసేందుకు తౌసిఫ్ ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో నికితా తోమర్ చనిపోయింది. పట్టపగలు జరిగిన ఈ హత్య సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీంతో నిందితులు తౌసిఫ్, అనుచరుడు రెహాన్తోపాటు అజ్రును పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా, నికిత తనను మోసం చేసి మరొకరిని పెండ్లి చేసుకునేందుకు సిద్ధం కావడంతో ఆమెను చంపినట్లు నిందితుడు తౌసిఫ్ పోలీసులకు తెలిపాడు. ఆమె వల్ల తన జీవితం నాశనం అయ్యిందని, 2018లో నికిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో తనను అరెస్ట్ చేయడంతో వైద్య విద్యను కొనసాగించలేకపోయినట్లు తెలిపాడు. అందుకే ప్రతీకారంతో నికితను హత్య చేసినట్లు కేసు దర్యాప్తు చేసిన సిట్‌కు వెల్లడించాడు.
మరోవైపు పెండ్లి చేసుకుని మతం మారాలని తమ కుమార్తెను తౌసిఫ్బలవంతం చేసినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ‘లవ్‌జిహాద్’ కోణంలో కూడా సిట్ దర్యాప్తు చేసింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్తగూడెం ఏరియాలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
‘కరకట్ట నిర్మాణం వల్ల బూర్గంపాడుకు అపార నష్టం’
‘ఓటరు నమోదులో వేగం పెంచాలి… రేవంత్ రెడ్డిని గద్దె దించాలి’
‘పిల్లలపై లైంగిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
Harish Rao | చంద్రబాబు నాయుడు ఏపీకి కరువు లేకుండా చేశారు.. తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్ : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

