పిల్లలకు ఐస్‌క్రీమ్ అమ్మనందుకు.. స్టాక్ మొత్తం ధ్వంసం చేశాడు

ముంబై: పిల్లలకు ఐస్‌క్రీమ్ అమ్మనందుకు ఆగ్రహించిన ఒక వ్యక్తి ఆ షాపు బయట ఉన్న ఐస్‌క్రీమ్ స్టాక్ మొత్తాన్ని ధ్వంసం చేశాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 19న తెల్లవారుజామున 2.11 గంటలకు ఒక వ్యక్తి తన పిల్లలతో కలిసి వసాయ్‌లోని కౌల్ హెరిటేజ్ సిటీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడున్న మెడికల్ షాపు బయట ఉన్న ఐస్‌క్రీమ్ కావాలని పిల్లలు అడిగారు. అయితే వాటిని అమ్మేందుకు షాపు వ్యక్తి నిరాకరించాడు. మధ్య రాత్రి వేళ కావడంతో గ్రిల్ వేసి ఉన్న షాపు నుంచి బయటకు వచ్చి ఐస్‌క్రీమ్‌లు తీసి ఇవ్వడం ఇష్టం లేక ఇలా బదులిచ్చాడు.
దీంతో ఇద్దరు పిల్లలతో ఉన్న వ్యక్తి షాపు యజమానితో వాదనకు దిగాడు. అనంతరం అక్కడున్న శానిటైజర్ ఇనుప స్టాండ్‌తో ఆ షాపు యజమానిని బెదిరించాడు. అంతటితో ఆగక బయట ఫ్రిజ్‌లలో ఉన్న ఐస్‌క్రీమ్ స్టాక్‌ను శానిటైజర్ ఇనుప స్టాండ్‌తో ధ్వంసం చేశాడు. అనంతరం దానిని అక్కడే పడేసి వెళ్లిపోయాడు.
కాగా, ఎదురుగా ఉన్న ఒక మెడికల్ షాపులోని సీసీటీవీలో ఇది రికార్డు అయ్యింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

