Molestation: భర్త కోసం బాలిక జీవితాన్ని బలి చేసిన మహిళ.. దంపతులిద్దరిపై కేసు నమోదు..!
Molestation: అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. కౌశాంబి జిల్లా పశ్చిమ

లక్నో: అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. కౌశాంబి జిల్లా పశ్చిమ సరీరా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన మహిళ.. స్థానికంగా ఉండే మైనర్ బాలికను ఇంటికి తీసుకెళ్లి తన భర్తతో అత్యాచారం చేయించింది. ఈ ఘటన ఈ ఏడాది జనవరి 14న జరుగగా.. శనివారం బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి 14న నిందితురాలు స్థానికంగా ఉండే 16 ఏండ్ల దళిత బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ తన భర్తతో అత్యాచారం చేయించింది. నిందితుడు తన భార్య ముందే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయం బయటచెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించి పంపించారు. దాంతో భయపడిపోయిన బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచేసింది.
అయితే, బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయం చెప్పింది. దాంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో నేరుగా కోర్టుకు వెళ్లింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నిందితులైన దంపతులిద్దరిపైనా కేసులు నమోదుచేశారు. ప్రాథమిక విచారణ అనంతరం వారిని అరెస్టు చేయనున్నట్లు తెలిపారు. బాలికను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి పంపించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

