పిల్లల ఫైట్‌లో పెద్దల జోక్యం.. కోట్లాటలో బాలుడి నాలుక కోసివేత

లక్నో: పొరుగున ఉండే ఇద్దరి పిల్లల ఫైట్‌లో వారి పెద్దల జోక్యంతో వివాదం మరింత ముదిరింది. ఈ కోట్లాటలో 12 ఏండ్ల బాలుడి నాలుకను పొరుగింటి వ్యక్తి కోసివేయగా, మరో పొరుగింటి వ్యక్తి దాడిలో మరో బాలుడి తలకు దెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్షహెర్ ఖుర్జా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పొరుగున ఉండే స్నేహితులైన ఇద్దరు పిల్లలు పోట్లాడుకున్నారు. గమనించిన ఇరువురి కుటుంబాల మధ్య వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దీంతో ఒకరిపై మరొకరు భౌతికంగా దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక బాలుడి నాలుకను పొరిగింటి వ్యక్తి కత్తిరించాడు. మరో వ్యక్తి అతడి కుమారుడిని నెట్టివేయడంతో మరో బాలుడి తలకు గాయమైంది.
కాగా, బయట ఆడుకుంటున్న తమ కుమారుడ్ని పొరుగింటి వారు కొట్టారని నాలుక తెగిన బాలుడి తండ్రి ఆరోపించాడు. ఈ ఘర్షణపై ఇరు కుటుంబాల ఫిర్యాదుతో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకర్ని అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నాలుక తెగిన బాలుడు చికిత్స పొందుతుండగా, తలకు గాయమైన బాలుడ్ని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

