మాజీ ప్రియురాలి తల నరికిన వ్యక్తి… పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి లొంగుబాటు
బెంగళూరు: ఒక వ్యక్తి మాజీ ప్రియురాలి తల నరికి హత్య చేశాడు. అనంతరం ఆమె తలను చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. కర్ణాటకలోని విజయనగరం జిల్లాలో ఈ దారుణం జరిగింది. కుడ్లిగి ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల బోజరాజు ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. 21 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని నిర్మలను గతంలో అతడు ప్రేమించాడు. కాగా, బోజరాజు ఇటీవల మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే నిర్మల మరో వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు అతడు అనుమానించాడు. ఈ నేపథ్యంలో కత్తిని వెంట ఉంచుకుని కన్నబోరనయ్య హట్టి ప్రాంతంలోని ఆమె ఇంటికి వెళ్లాడు. ఒంటరిగా ఉన్న నిర్మలపై కత్తితో దాడి చేసి తల నరికి చంపాడు.
అనంతరం నిందితుడు బోజరాజు ఆమె తలను పట్టుకుని కన్నబోరనయ్య పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడిపై హత్య, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

