హైదరాబాద్ : కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురి పట్ల ఓ తండ్రి కన్నేశాడు. మద్యం మత్తులో ఉన్న ఆ కీచకుడు.. తన 15 ఏండ్ల కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగికదాడికి యత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన బాధితురాలి తల్లి.. అతని దాడి నుంచి బిడ్డను కాపాడుకుంది. ఈ ఘటన నల్లకుంటలోని రత్న నగర్లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిపై భార్య కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి భవన నిర్మాణ రంగంలో కూలీగా పని చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.