కత్తులతో నరికి వ్యక్తి దారుణ హత్య
వ్యక్తి దారుణ హత్య | ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సోమందేపల్లి జగ్జీవన్ రామ్‌నగర్‌కు చెందిన హరిజన నాగేంద్ర(35)ను మంగళవారం అర్థరాత్రి గుర్తుతెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా నరికి హతమార్చారు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సోమందేపల్లి జగ్జీవన్ రామ్‌నగర్‌కు చెందిన హరిజన నాగేంద్ర(35)ను మంగళవారం అర్థరాత్రి గుర్తుతెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా నరికి హతమార్చారు.
ఉదయం హత్య జరిగిన విషయం వెలుగులోకి రావడంతో పెనుకొండ డీఎస్పీ మహబూబ్ బాషా, సీఐ శ్రీహరి, ఎస్ఐ వెంకట రమణ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
కాలనీవాసులను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
పాతకక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. హత్య స్థానికంగా కలకలం సృష్టించింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

