శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
Shamshabad Airport |
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ముగ్గురు ప్రయాణికుల వద్ద రూ. 4 కోట్ల విలువైన 7.695 కిలో గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి ఈకే -528 విమానం శుక్రవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ విమానంలో భారీగా బంగారాన్ని తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ముగ్గురు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని తనిఖీ చేశారు.
అందులో ఒక ప్రయాణికుడు ఎవరికీ అనుమానం రాకుండా రూ.2,57,47,700 విలువైన 4895.000 గ్రాముల బంగారాన్ని ఎయిర్ కంప్రెషర్లోపల పెట్టి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనధికారికంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే విమానం నుంచి వచ్చిన మరో వ్యక్తి తన లగేజి తీసుకుని కస్టమ్స్ గ్రీన్ చానల్‌ను దాటేందుకు యత్నించగా అనుమానం వచ్చిన అధికారులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతడి వద్ద 24 క్యారెట్ల 12 బంగారం బిస్కెట్లు లభించాయి. 1400 గ్రాములు ఉన్న ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తిని విచారిస్తున్నారు.
మరో వ్యక్తి తన లగేజితో కస్టమ్స్ గ్రీన్ ఛానెల్ దాటేందేకు యత్నిస్తుండగా కస్టమ్స్ అధికారులు సదరు వ్యక్తిని తనిఖీచేయగా 1400 గ్రాముల 12 బంగారం బిస్కెట్లు(24క్యారెట్లు) లభించాయి. ఈ మేరకు ముగ్గురు నిందితులను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.4కోట్ల విలవ చేసే 7.695 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంపీ చామల కనిపించడం లేదంటూ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
Minister Seethakka | మహిళతో కాళ్లు మొక్కించుకున్న మంత్రి సీతక్క.. వీడియో
సంబంధం ఉన్న పోలీస్ అధికారిని.. ముగ్గురితో కలిసి హత్య చేసిన మహిళా కానిస్టేబుల్
ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి మహర్దశ
ప్రమాద రహిత సింగరేణి.. నూతన కార్మిక భద్రతా నిబంధనలపై అవగాహన శిబిరం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

