Jagtial | కూతురి పెళ్లయిన కొన్ని గంటలకే.. తండ్రి హఠాన్మరణం
Jagtial | మల్లాపూర్ : అప్పటి దాకా బంధువుల కోలాహలంతో సందడిగా ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా మూగబోయింది. బిడ్డ పెండ్లయిన కొన్ని గంటలకే తండ్రి హఠాన్మరణం( Cardiac Arrest ) చెందడం బంధుమిత్రులను కలిచివేసింది.
- జగిత్యాల జిల్లా కొత్తదాంరాజ్‌పల్లిలో పెళ్లింట విషాదం
Jagtial | మల్లాపూర్ : అప్పటి దాకా బంధువుల కోలాహలంతో సందడిగా ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా మూగబోయింది. బిడ్డ పెండ్లయిన కొన్ని గంటలకే తండ్రి హఠాన్మరణం( Cardiac Arrest ) చెందడం బంధుమిత్రులను కలిచివేసింది. ఈ ఘటనతో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్తదాంరాజ్‌పల్లిలో విషాదం అలుముకున్నది.
కొత్తదాంరాజ్‌పల్లి గ్రామానికి చెందిన బెజ్జారపు లింబాద్రి(45) చిన్న కూతురు పెండ్లి గురువారం అంగరంగ వైభవంగా జరిపించారు. అప్పగింతల కార్యక్రమాన్ని సైతం పూర్తి చేశారు. అనంతరం లింబాద్రి.. తన కుటుంబీకులు, బంధుమిత్రులతో కలిసి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. నిద్రలోనే గుండెపోటుగు గురై మరణించాడు. శుక్రవారం తెల్లవారుజామున నిద్రలేచిన కుటుంబ సభ్యులు విగతజీవిగా కనిపించిన ఇంటిపెద్దను చూసి బోరుమన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

