వరుడి ఫ్రెండ్, వధువు సోదరుడిపై కత్తులతో దాడి.. ఎందుకంటే..?
ముంబై : ఓ వివాహ విందు వేడుకలో దారుణం జరిగింది. పెళ్లి కుమారుడి స్నేహితుడితో పాటు వధువు సోదరుడిపై ఓ నలుగురు వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి కారణం మ్యూజిక్ అని బాధిత వ్యక్తుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్లోని కపిల్ నగర్లో సోమవారం చోటు చేసుకుంది.
కపిల్ నగర్కు చెందిన ఓ యువకుడు శనివారం వివాహం చేసుకున్నారు. పెళ్లి కుమార్తె ఇంటి వద్ద ఆదివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. రిసెప్షన్లో భాగంగా మ్యూజిక్ ఏర్పాటు చేసినప్పటికీ మధ్యలో ఆపేశారు. దీంతో మ్యూజిక్ ఎందుకు ఆపేశారని ఓ నలుగురు వ్యక్తులు.. వరుడి స్నేహితుడు, వధువు సోదరుడితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆ ఇద్దరిపై నలుగురు కలిసి కత్తులతో దాడికి పాల్పడ్డారు. బాధిత వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ నలుగురు రిసెప్షన్ నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

