Crime News | బాత్రూంలో మొబైల్ ఫోన్ చూసిన ట్యూషన్ టీచర్.. ఎవరు పెట్టారో తెలిసి షాక్
ఒక మహిళ దాదాపు ఐదేళ్లుగా ట్యూషన్ టీచర్‌గా పని చేస్తోంది. ఒక బాలుడు 10-11 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఆమె దగ్గర ఇంగ్లీషు నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి 16 ఏళ్లు. ఇటీవల ట్యూషన్ చెప్పేందుకు ఆ ఇంటికి వెళ్లిన ఆమె.. బాత్రూంకు వెళ్లింది. బాత్రూంలో స్నానం చేస్తుండగా ఒక సోప్ బాక్స్ పక్కనే మొబైల్ ఫోన్ ఉండటం ఆమె కంటపడింది.
దాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆమె.. ఆ మొబైల్ చెక్ చేసింది. అది తను స్నానం చేస్తున్న వీడియో రికార్డు చేయడం చూసి షాకైంది. ఆ మొబైల్లో తనకు సంబంధించిన చాలా ఫొటోలు, వీడియోలు ఉండటంతో ఏం జరిగిందో ఆమెకు అర్థమైంది. వెంటనే బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసింది.
సదరు ట్యూషన్ టీచర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె వద్ద ట్యూషన్ చెప్పించుకుంటున్న బాలుడే మొబైల్‌ను బాత్రూంలో రహస్యంగా పెట్టాడని గుర్తించారు. అలా ఆమె ఫొటోలు, వీడియోలు సేకరించేవాడని పోలీసు దర్యాప్తులో తేలింది. దీంతో సదరుబ బాలుడిపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలియజేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

