Nightclub Fire | బర్త్‌డే పార్టీలో విషాదం : నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదంతో 11 మంది మృతి
స్పెయిన్‌లోని ముర్సియ నైట్‌క్లబ్‌లో (Nightclub Fire) ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మరణించారు. సహాయ సిబ్బంది శిధిలాలు తొలగిస్తుండటంతో మృతుల సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నారు.
మ్యాడ్రిడ్ : స్పెయిన్‌లోని ముర్సియ నైట్‌క్లబ్‌లో (Nightclub Fire) ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మరణించారు. సహాయ సిబ్బంది శిధిలాలు తొలగిస్తుండటంతో మృతుల సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నారు. నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదానికి కారణాలేంటనేది దర్యాప్తు అనంతం వెలుగుచూస్తాయని, ఈ ఘటనలో ఇప్పటివరకూ 11 మంది మరణించారని పోలీసులు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
అత్యవసర సేవల విభాగం విడుదల చేసిన ఫొటోల ప్రకారం ఫాండా మిలగ్రోస్గా పిలిచే టీట్రే నైట్ క్లబ్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నైట్‌క్లబ్ భవనం పైకప్పు నుంచి పొగ వ్యాపిస్తుండటం ఈ ఫొటోల్లో కనిపించింది. శనివారం రాత్రి బర్త్‌డే పార్టీ జరిగిందని, ఈ వేడుకకు హాజరైనవారిలో కొందరి ఆచూకీని ఇంకా గుర్తించలేదని పోలీసులు పేర్కొన్నారు.
నైట్‌క్లబ్ ఫస్ట్ ఫ్లోర్లో అగ్నిప్రమాదం జరిగిందని ప్రాధమిక వివరాల్లో వెల్లడైంది. ఈ ఘటనలో నలుగురు గాయపడగా, వీరంతా పొగను పీల్చడంతో అస్వస్ధతకు లోనయ్యారని అధికారులు చెప్పారు. ఘటనా స్ధలానికి 40 అగ్నిమాపక యంత్రాలు 12 అత్యవసర వాహనాలు చేరుకున్నాయని ముర్సియ మేయర్ జోస్ బలెస్ట తెలిపారు.
Read More :
Gas Cylinder Price | కేంద్రం భారీ షాక్.. గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెంపు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

