ఘోర బస్సు ప్రమాదం.. 17 మంది వరద బాధితుల దుర్మరణం
road accident | పొరుగుదేశం పాకిస్థాన్ ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకున్నది. బస్సుకు మంటలు అంటుకొని 17 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. వీరంతా వరద బాధితులని, దక్షిణ పాక్లోని
ఇస్లామాబాద్ : పొరుగుదేశం పాకిస్థాన్ ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకున్నది. బస్సుకు మంటలు అంటుకొని 17 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. వీరంతా వరద బాధితులని, దక్షిణ పాక్లోని ఇండ్లకు తిరిగి వస్తుండగా బస్సు మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ – సింధ్ పావిన్స్లోని జంషోరో నగరాలను కలిపే ఎం-9 మోటార్ వే వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకున్నది.
ఇప్పటి వరకు ప్రమాదంలో 17 మంది మృతి చెందారని, మరో 10 మంది గాయపడ్డారని పార్లమెంటరీ ఆరోగ్య కార్యదర్శి సిరాజ్ ఖాసిం సూమ్రో తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 35 మంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొన్నారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నట్లు తెలుస్తున్నది. బస్సులో ఉన్న వారంతా వరద బాధితులని, మోటార్ వే నుంచి దాదు జిల్లాలోని ఇండ్లకు తిరిగి వెళ్తున్నారని జంషోరో జిల్లా కమిషనర్ ఆసిఫ్ జమీల్ తెలిపారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సింధ్ ప్రావిన్స్ వరదలకు ఎక్కువ దెబ్బతిన్న జిల్లాల్లో దాదు జిల్లా ఒకటి. అయితే, బస్సులో మంటలు చెలరేగడానికి కారణాలు తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. బస్సు వెనుక భాగంలో మంటలు చెలరేగాయని, తర్వాత మంటలు వ్యాపించి బస్సు మొత్తం దగ్ధమైందని అధికారులు పేర్కొన్నారు. కొందరు ప్రాణాలను కాపాడుకునేందుకు బస్సులో నుంచి దూకారని చెప్పారు.
ఇదిలా ఉండగా.. ఆగస్టులో ముల్తాన్ సదరన్ పంజాబ్లో ఓ ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పాక్లో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం. ప్రధానంగా అతివేగం, రోడ్డు మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం, ఫిట్నెస్ లేని వాహనాలు వినియోగం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 2017లో ఈ ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడి మంటలు చెలరేగిన ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

