అబిడ్స్ : గంజాయి విక్రేత అజయ్‌సింగ్‌పై పలుమార్లు పీడీయాక్టు నమోదు చేసినా మార్పు రాకపోవడంతో మరోమారు నగర పో లీస్ కమీషనర్ అంజనీకుమార్ పీడీయాక్టు నమోదు చేసి జైలుకు తరలించారు.
ఈ మేరకు నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ తెలిపిన వివరాల ప్రకారం మంగళ్‌హాట్ అప్పర్ ధూల్‌పేట్, గంగా బౌళి, అవంతిబాయినగర్కు చెందిన బి అజయ్‌సింగ్ (44) ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తూ, అధికంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో గంజాయి విక్రేతగా మారాడు.గతంలో మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్లో రెండు గంజాయి కేసుల్లో అరెస్టు అయ్యాడు.
అయినప్పటికీ అతనిలో మార్పు రాకపోవడంతో 2018లో పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు తరలించడం జరిగిందన్నా రు. ఇదిలా ఉండగా జైలు నుంచి విడుదల అయిన అనంతరం కూడా అతను తిరిగి యథావిధిగా గంజాయి విక్రయాలు చేపడుతుండటంతో మంగళవారం మరోమారు పీడీయాక్టును నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.