లోయలో పడిన బస్సు.. ఎనిమిది మంది మృతి
షిమ్లా : హిమాచల్‌ప్రదేశ్ చంబా జిల్లాలో బుధవారం ఘోర దుర్ఘటన జరిగింది. తీసా సబ్ డివిజన్ వద్ద ప్రైవేటు బస్సు లోయలో పడిపోయిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు.
షిమ్లా : హిమాచల్‌ప్రదేశ్ చంబా జిల్లాలో బుధవారం ఘోర దుర్ఘటన జరిగింది. తీసా సబ్ డివిజన్ వద్ద ప్రైవేటు బస్సు లోయలో పడిపోయిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. బస్సు చంబాకు వస్తుండగా.. చంబా-ఖజ్జియార్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో 16 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చంబా హాస్పిటల్‌కు తరలించారు. సంఘటనా స్థలంలోనే ఆరుగురు మరణించగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిందని పోలీసులు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై శాసనసభ డిప్యూటీ స్పీకర్, చురా ఎమ్మెల్యే హన్స్‌రాజ్ సహా ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి రూ.4లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే గాయపడ్డ వారికి కూడా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

