Video: బాలికల హాస్టల్ వద్ద యువకుల ‘కార్ స్టంట్’… తర్వాత ఏమైందంటే?
లక్నో: బాలికల హాస్టల్ బయట కొందరు యువకులు కార్‌తో స్టంట్ చేశారు. చాలా సేపు ఆ హాస్టల్ ముందు కారుపై విన్యాసాలు చేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తర ప్రదేశ్ పరిధిలోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. గౌతమ బుద్ధ నగర్ ప్రాంతంలోని నాలెడ్జ్ పార్క్ వద్ద బాలికల హాస్టల్ ఉంది. శుక్రవారం రాత్రి కొందరు యువకులు కార్లలో అక్కడికి వెళ్లారు. కారుపై స్టంట్లు చేశారు. ఒక యువకుడు కారు బోనెట్‌పై కూర్చోగా, మరో ఇద్దరు కారు డోర్ల వద్ద ప్రమాదకరంగా వేలాడారు. బాలికల హాస్టల్ ఎదుట కారు విన్యాసాలతో హంగామా చేశారు. కొంత సేపు అక్కడే ఉన్నారు.
మరోవైపు స్థానికులు తమ మొబైల్లో దీనిని వీడియో తీశారు. ఒక వీడియో క్లిప్‌ను పోలీసులకు పంపి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు స్పందించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ యువకులను గుర్తించారు. ప్రశాంత్ కుమార్, భావ్ సాగర్ అనే ఇద్దరు నిందితులను శనివారం అరెస్ట్ చేశారు. వారు వినియోగించిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో కారులో ఉన్న మరి కొందరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Two people were arrested for performing a dangerous stunt with their car outside a girls hostel in #GreaterNoida, officials said.@noidapolice pic.twitter.com/tF9cVF4a9A
— IANS (@ians_india) July 23, 2022
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

