ముంబై : క్రూయిజ్ పార్టీ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను ముంబై కోర్టు తిరస్కరించింది. బెయిల్ పిటిషన్ తిరస్కరణతో ఎన్సీబీ కస్టడీ కింద ఆర్యన్ ఖాన్ ముంబైలోని ఆర్ధర్ రోడ్డు జైలులో గడపనున్నాడు.
ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్‌లో ఆదివారం జరిగిన రేవ్ పార్టీపై ఎన్సీబీ అధికారుల దాడిలో ఆర్యన్ ఖాన్ సహా పలువురు డ్రగ్స్‌తో పట్టుబడిన సంగతి తెలిసిందే. వీరి నుంచి భారీమొత్తంలో మత్తుపదార్ధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.