కావలసిన పదార్థాలు
తాజా టోఫు: ఒకటి (ముక్కలుగా) నీళ్లు: 5 కప్పులు, ఉప్పు: రుచికి సరిపడా, తెల్ల మిరియాల పొడి: చిటికెడు,
అల్లం: 20-30 గ్రాములు (తరిగినది), పాలు: 1 కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి (తరిగినది), నువ్వుల నూనె: 1 చెంచా. కూరగాయలు: కొన్ని.
తయారీ విధానం
ఒక పాత్రలో నీళ్లు తీసుకోవాలి. అందులో టోఫు వేసుకుని వేడిచేయాలి. టోఫు మెత్తగా అయ్యేవరకు అలానే ఉంచాలి. ఆ తర్వాత ఉప్పు, అల్లం, ఉల్లిగడ్డ తరుగు, నువ్వుల నూనె అందులో కలపాలి. ఈ మిశ్రమానికి వెదురు మొలకలు, స్ప్రింగ్ ఆనియన్, బ్రకోలి లాంటి తాజా కూరగాయలు చేర్చుకుంటే మంచిది. మిశ్రమం చిక్కబడటానికి పాలు కలుపుకోవాలి. చివర్లో తెల్ల మిరియాల పొడి చల్లుకోవాలి. ఆ తర్వాత వేడివేడి సూప్ సర్వ్ చేసుకోవాలి.