పంజాబీ మామిడి తొక్కు పచ్చడి
ముందుగా మామిడికాయలను మందంగా చెక్కు తీసుకోవాలి. చాపర్లో వేసి దీన్ని సన్నటి తురుములా చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక మామిడి కాయను చెక్కు తీసి పూర్తిగా తురుముకోవాలి.
కావాల్సిన పదార్థాలు
మందంగా తీసిన మామిడికాయ చెక్కులు : ఆరు మామిడికాయలవి, మామిడికాయ: ఒకటి, సోంపు: పావు కప్పు , కలోంజి: ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర: ఒక టీ స్పూన్, మెంతి పొడి: ఒక టీ స్పూన్, రాయి దాన పొట్టు లేని ఆవాలు: అర కప్పు, ఆవనూనె: ఒకటిన్నర కప్పు, ఉప్పు : ఒకటింబావు కప్పు, కారం: ముప్పావు కప్పు , ఆవ పిండి: కప్పు, నువ్వుల నూనె: ఒకటిన్నర కప్పు
తయారు చేసే విధానం
ముందుగా మామిడికాయలను మందంగా చెక్కు తీసుకోవాలి. చాపర్లో వేసి దీన్ని సన్నటి తురుములా చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక మామిడి కాయను చెక్కు తీసి పూర్తిగా తురుముకోవాలి. ఈ రెంటిని సగభాగం తీసి పక్కన పెట్టుకోవాలి. సోంపు జీలకర్ర దోరగా వేయించుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మామిడి తురుము చెక్కుల మిశ్రమంలోని సగభాగాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని వేయించిన సోంపు-జీలకర్ర పొడి, మెంతిపొడి, రాయి దాన, అరకప్పు ఉప్పు వేసి కలుపుకోవాలి.
ఆవనూనెను పొయ్యి మీద బాగా వేడి చేసి ఈ మిశ్రమంలో పోసి కలిపి పెట్టుకుంటే పంజాబీ స్టయిల్ ఆవ తొక్కు పచ్చడి సిద్ధం అయిపోతుంది. అలాగే మిగతా సగం మామిడి చెక్కులో కప్పు ఆవపిండి, ముప్పావు కప్పు కారం, ముప్పావు కప్పు ఉప్పు కలిపి నువ్వుల నూనె పోసి కలిపి పెట్టుకుంటే మన మోడల్ ఆవకాయ చెక్కు పచ్చడి రెడీ అవుతుంది. రెండు మూడు రోజుల ఊరనిచ్చి అన్నంలో కలుపుకుంటే బాగుంటాయివి.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

