ఆనపకాయ కాజు గ్రేవీ
ముందుగా జీడిపప్పులు, గసగసాలను కొద్దిపాటి నీళ్లలో గంటసేపు నానబెట్టాలి. పెద్ద ఉల్లిపాయను మీడియం సైజు ముక్కలుగా తరుక్కోవాలి. ఇప్పుడు రెండు కప్పుల నీళ్లు తీసుకుని అందులో జీడిపప్పులు, గసగసాలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, ఎండు మిరపకాయలు వేసి ఉడికించుకోవాలి. ఇక్కడ రెండు కప్పుల నీళ్లు ఒక కప్పు అయ్యేదాకా మరిగించుకోవాలి.
కావలసిన పదార్థాలు
ఆనపకాయ: మీడియం సైజుది సగం
జీడిపప్పులు: పది పన్నెండు
పెద్ద ఉల్లిగడ్డ: ఒకటి
వెల్లుల్లిపాయలు: ఐదారు
గసగసాలు: ఒక టీ స్పూన్
ఎండు మిరపకాయలు: రెండు
అల్లం: అర ఇంచు ముక్క
గరం మసాలా పొడి: అర స్పూను
కొత్తిమీర: రెండు రెబ్బలు
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు: తగినంత
తయారు చేసే విధానం
ముందుగా జీడిపప్పులు, గసగసాలను కొద్దిపాటి నీళ్లలో గంటసేపు నానబెట్టాలి. పెద్ద ఉల్లిపాయను మీడియం సైజు ముక్కలుగా తరుక్కోవాలి. ఇప్పుడు రెండు కప్పుల నీళ్లు తీసుకుని అందులో జీడిపప్పులు, గసగసాలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, ఎండు మిరపకాయలు వేసి ఉడికించుకోవాలి. ఇక్కడ రెండు కప్పుల నీళ్లు ఒక కప్పు అయ్యేదాకా మరిగించుకోవాలి. తర్వాత చల్లార్చి వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తటి గ్రేవీలా పట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాణలి పెట్టి కొద్దిగా నూనె వేసి ఈ గ్రేవీని బాగా ఉడికించాలి. ఆనపకాయను చెక్కు తీసి మీడియం సైజు ముక్కలుగా తరిగి పెట్టుకుని, ఆ ముక్కలను ఈ గ్రేవీలో వేసి బాగా మగ్గనివ్వాలి. దానిమీద సరిపడా ఉప్పు వేసి, గరం మసాల పౌడర్ కూడా చల్లి ఒక నిమిషం మూత పెట్టాలి. దీనిపై సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే కాజు గ్రేవీతో ఆనపకాయ కూర సిద్ధమైపోతుంది!
ఎం.బాలరాయుడు
పాకశాస్త్ర నిపుణురాలు
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

