పాలక్ పనీర్ బుర్జీ
స్టవ్‌మీద కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అల్లం, వెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి బాగా వేయించాలి.
కావలసిన పదార్థాలు
పాలకూర తురుము: ఒక కప్పు, పనీర్ తురుము: ఒక కప్పు, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, నూనె: ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క: అంగుళం ముక్క, లవంగాలు: నాలుగు, యాలకులు: రెండు, బిర్యానీ ఆకు: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, ఉల్లిగడ్డ: ఒకటి, క్యాప్సికమ్: ఒకటి, టమాట: ఒకటి, అల్లం, వెల్లుల్లి ముద్ద: ఒక టీస్పూన్, కారం, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి: ఒక టీస్పూన్ చొప్పున, జీలకర్ర: అర టీస్పూన్, గరం మసాలా, మిరియాల పొడి, పసుపు: అర టీస్పూన్ చొప్పున, ఫ్రెష్ క్రీం: ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం: రెండు టీస్పూన్లు, ఉప్పు: తగినంత, కొత్తిమీర తురుము: కొద్దిగా.

పాలక్ పనీర్ బుర్జీ
స్టవ్‌మీద కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అల్లం, వెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి బాగా వేయించాలి. తర్వాత చిన్నగా తరిగిన క్యాప్సికం, టమాట ముక్కలు, పాలకూర తురుము వేసి మగ్గించాలి. ఫ్రెష్ క్రీం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, పసుపు, మిరియాల పొడి కూడా వేసి బాగా మగ్గిన తర్వాత పనీర్ తురుము వేసి బాగా కలపాలి. చివరగా నెయ్యి, కొత్తిమీర తురుము, నిమ్మరసం వేసి బాగా కలుపుకొంటే నోరూరించే పాలక్ పనీర్ బుర్జీ సిద్ధం.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

