Cinema News | పొట్టేల్‌లో బుజ్జిమేక భావోద్వేగాలు
యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటిస్తున్న చిత్రం ‘పొట్టేల్'. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో వాస్తవికతకు అద్దంపట్టే కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి సాహిత్ మోత్కూరి దర్శకుడు. ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మూడు పాటలను విడుదల చేయడం జరిగింది.
Cinema News | యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటిస్తున్న చిత్రం ‘పొట్టేల్’. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో వాస్తవికతకు అద్దంపట్టే కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి సాహిత్ మోత్కూరి దర్శకుడు. ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మూడు పాటలను విడుదల చేయడం జరిగింది. శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన నాలుగవ పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘బుజ్జి మేక..’ అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, శేఖర్‌చంద్ర స్వరపరిచారు. కాలభైరవ ఆలపించారు.
భావోద్వేగపూరితంగా ఈ పాట సాహిత్యం, చిత్రీకరణ సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు. విజువల్స్ కూడా నేచురల్‌గా ఉంటాయని వారు తెలిపారు. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు నిశాంత్‌రెడ్డి కుడితి, సురేశ్‌కుమార్ సడిగే తెలిపారు. అజయ్, ప్రియాంకశర్మ, తనస్వి చౌదరి, నోయల్సీన్, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మోనిష్ భూపతిరాజు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

