కెన్ కరునాస్, అనిష్మ అనిల్‌కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన యువతరం చిత్రం ‘యూత్’. కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వంలో, కరుపయ్య సి.రామ్, సులోచన కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై థియేటర్లలో ప్రదర్శితమవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్‌మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. హీరో శర్వానంద్, డైరెక్టర్ వశిష్ట, నిర్మాత ధీరజ్ మొగిలినేని ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి అభినందనలు అందించారు. పిల్లలు తమ తల్లిదండ్రులను, తల్లిదండ్రులు తమ పిల్లల్నీ అర్థం చేసుకోవాలనే సందేశంతో రూపొందిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ అందరికీ నచ్చిందని, థియేటర్లన్నీ యూత్‌తో నిండిపోతున్నాయని నిర్మాతలు ఆనందం వెలిబుచ్చారు. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా సక్సెస్ కావడం చాలా ఆనందంగా ఉందని, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇదనీ దర్శకుడు, హీరో కెన్ కరునాస్ అన్నారు. ఇంకా చిత్రబృందం అంతా మాట్లాడారు.