టాలీవుడ్లో తీరిక లేనన్ని సినిమాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది యువ తార శ్రీలీల. ఆమె చేతిలో ప్రస్తుతం ఏడు నుంచి పది చిత్రాలు ఉండటం విశేషం. ఇవన్నీ స్టార్ హీరోల సరసన కావడంతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్గా మారిపోయింది శ్రీలీల. భారీ చిత్రాల్లోకి ఆహ్వానం అందుతుండటంతో ఏ సినిమానూ కాదనలేని పరిస్థితిలో ఉందట ఈ భామ. దీంతో ఈ నాయిక రోజుకు దాదాపు 16 గంటలు షూటింగ్‌లు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
ప్రస్తుతం ఆమె హీరో రామ్ మూవీ, హీరో నితిన్ సరసన నటిస్తున్న సినిమాతో పాటు విజయ్ దేవరకొండ జోడీగా చేస్తున్న చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నది. ఈ మూడు సినిమాల షూటింగ్స్ మధ్య శ్రీలీల చక్కర్లు కొడుతున్నది. ఇవి గాక ఆమె ఖాతాలో పవన్ కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, వైష్ణవ్‌తేజ్‌తో ‘ఆదికేశవ’, మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా, ఎన్బీకే 108 తదితర ప్రాజెక్ట్స్ ఉన్నాయి.