చూడాలని ఉంది అంటారు
యష్ పూరి, స్టెఫీ పటేల్ జంటగా నటిస్తున్న సినిమా ‘చెప్పాలని ఉంది’. ఈ చిత్రాన్ని సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్బీ చౌదరి సమర్పణలో వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మిస్తున్నారు
యష్ పూరి, స్టెఫీ పటేల్ జంటగా నటిస్తున్న సినిమా ‘చెప్పాలని ఉంది’. ఈ చిత్రాన్ని సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్బీ చౌదరి సమర్పణలో వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మిస్తున్నారు. అరుణ్ భారతి ఎల్ దర్శకుడు. ఈ నెల 9న విడుదలవుతున్నది. తాజాగా జరిగిన చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ…‘తెలుగు సినీ పరిశ్రమలోకి యువత మరింతగా రావాలి. వారు అద్భుతాలు సృష్టించగలరు. టాలీవుడ్‌కు కావాల్సిన అన్ని సహాయ సహకారాలను మా ప్రభుత్వం అందిస్తున్నది.
ఈ చిత్ర ట్రైలర్ బాగుంది. యష్ పూరికి విజయం దక్కాలని కోరుకుంటున్నా’ అన్నారు. హీరో యష్ పూరి మాట్లాడుతూ…‘ఈ నెల 9న కొన్ని పెద్ద చిత్రాలు విడుదలవుతున్నాయి. మంచి సినిమా ఎప్పుడు మీ ముందుకొచ్చినా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. సినిమా బాగుందనే మాటే అతి పెద్ద ప్రచారం. ఆ మాట మీ దగ్గర నుంచి వస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ…‘మాలాంటి యువ హీరోలు ఎదిగేందుకు ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తున్నది. చిత్రీకరణ, థియేటర్స్ విషయంలో ప్రభుత్వం అండగా నిలబడుతున్నది. నేనూ యష్ లాగే ప్రయాణం మొదలుపెట్టాను. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు.
‘ఈ సినిమాలో వెన్నెల పాత్రలో నటించాను. చాలా మంచి క్యారెక్టర్ ఇది. ఈ ఎంటర్టైనింగ్ మూవీలో యాక్షన్, రొమాన్స్ వంటి అన్ని అంశాలుంటాయి’ అని నాయిక స్టెఫీ పటేల్ చెప్పింది. ‘వివిధ భాషల నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు. అలా ఈ సినిమా రియల్ పాన్ ఇండియా మూవీగా ఆకట్టుకుంటుంది’ అని దర్శకుడు అరుణ్ భారతి ఎల్ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
4 Militants Killed | మణిపూర్‌లో ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు.. నలుగురు మిలిటెంట్లు మృతి
ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
Hunter Road | సౌకర్యవంతమైన సేవల కోసం హంటర్ రోడ్డులో కొత్త బస్ స్టాప్
సారపాకలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Y.S. Sharmila | ఎన్నికల్లో విజయం ప్రజా తీర్పు కాదు..అధికార మదంతో బలవంతపు గెలుపు : వైఎస్ షర్మిల
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

